ప్రముఖ సినీనటుడు ప్రభాస్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని నీరూస్ జంక్షన్ వద్ద బ్లాక్ ఫిల్మ్‌తో వెళ్తున్న కారును పోలీసులు ఆపి పరిశీలించగా అది ప్రభాస్‌దిగా తేలింది.
నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం, బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ.1,450 చలానా విధించారు. అయితే ఆ సమయంలో ప్రభాస్ కారులో లేరు. ఇదే కారణంతో ఇటీవల ఎన్టీఆర్, నాగచైతన్య, మంచు మనోజ్‌తదితరుల కార్లకు పోలీసులు ఫైన్ వేసిన సంగతి తెలిసిందే.