నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ విడతల వారీగా అనుమతులు ఇస్తోంది. తొలి విడతలో 30,453 పోస్టులకు పర్మిషన్ ఇచ్చిన ఆర్థికశాఖ.. ఈరోజు మరో 3,334 పోస్టుల భర్తీకి అనుమతించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ పోస్టులు అగ్నిమాపక, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని ఖాళీలకు సంబంధించినవి. మిగతా శాఖల్లోని ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చే విషయంపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఆర్థికశాఖ అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఆయా విభాగాల వారీగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.