జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. 28 శాతం పన్ను పరిధిలో కేవలం 50 వస్తువులనే ఉంచాలని నిర్ణయించింది.గువాహటిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.227 వస్తువులు ఇంత వరకు 28 శాతం శ్లాబ్‌లో ఉండేవి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో వాటి సంఖ్య 50 కి తగ్గింది. 177 వస్తువులు 18 శాతం శ్లాబ్‌లోకి మారనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది వ్యాపారులకు ఉపశమనం కలగనుంది.షాంపూలు, డియోడరెంట్లు, స్టేషనరీ, శానిటరీవేర్, షేవింగ్ క్రీమ్, టూత్‌పేస్ట్ తదితర వస్తువులు ఇక నుంచి తక్కువ ధరలకే లభించనున్నాయి.గతంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో దాదాపు 100 వస్తువులపై పన్ను రేట్లను తగ్గించారు. ఇప్పుడు మరిన్ని వస్తువులను కూడా హైటాక్స్ బారి నుంచి తప్పించారు.
