ఈరోజు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు దీక్షపై గుర్రాల నాగరాజు స్పందించారు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదు , రైతుని మోసం చేస్తున్న కేంద్ర నాయకత్వం త్వరలోనే దాని పర్యవసానాలు చూస్తారు అని అన్నారు.
ఈరోజు తెలంగాణ రైతుల గురించి మాన్య ముఖ్య మంత్రి ఆధ్వర్యములో చేపట్టిన పోరాటంలో ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోందన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గు చేటని విమర్శించారు.
ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు! కెసిఆర్ గారు పెట్టిన 24 గంటల ధాన్యం సేకరణ డెడ్లైన్ పై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు ! రైతుల తరపున నిరసన లో పాల్గొన్న అందరికి నాగరాజు గుర్రాల ధన్యవాదాలు తెలిపారు .