ఏపీ అధికార వైసీపీ అధినేత ,సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా నంద్యాలలో రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగనన్న వసతి దీవెన కింద తదుపరి విడత నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
అనంతరం జరగనున్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిగతా జిల్లాల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈ పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్ వారికి రూ.15వేలు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు వసతి, భోజన, రవాణా ఖర్చుల కింద రూ.20వేలు ఇస్తారు.