తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు.
ఆలయానికి వచ్చిన మంత్రులకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మొదట ధ్వజస్తంభం పూజలు చేశారు.
ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు ఆశీర్వచనం చేశారు.ఆలయ ఈవో గీత తీర్థ ప్రసాదాలను అందజేశారు.