ఆ యువకుడు జీవితంపై విరక్తి చెందాడు. ఆత్మహత్య చేసుకుందామని రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. రైలు వచ్చే సమయంలో ట్రాక్‌పై పడుకున్నాడు. కానీ చనిపోయేందుకు ధైర్యం సరిపోలేదు. కానీ ఈలోపే రైలు వచ్చేయడంతో పట్టాల మధ్యే పడుకుండిపోయాడు. ఈ ఘటన వైజాగ్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే శుక్రవారం మధ్యాహ్నం వైజాగ్ రైల్వేస్టేషన్‌లోని నాలుగో ప్లాట్‌ఫామ్‌పైకి ఓ యువకుడు సడన్‌గా వచ్చాడు. ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై పడుకున్నాడు. అయితే సూసైడ్ చేసుకునేందుకు ధైర్యం సరిపోలేదు. ఈలోపు బయటకు వచ్చేద్దామనుకుంటే అప్పటికే రైలు దగ్గరికి వచ్చేసింది. ఏం చేయాలో తోచక పట్టాల మధ్యనే ఉండిపోయాడు. రైలు వెళ్లే వరకు అలా అక్కడే జాగ్రత్తగా ఉన్నాడు. ట్రైన్ వెళ్లిపోయాక అక్కడి ప్రయాణికులు ఆర్పీఎఫ్ స్టాప్‌కి చెప్పడంతో వారు ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.