ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత… మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సవాల్ విసిరారు. నిన్న గురువారం అసెంబ్లీలో మూడు రాజధానుల విషయంలో వెనక్కి వెళ్లము అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “రాష్ట్రానికి మూడు రాజధానుల అంశం గురించి మాట్లాడే నైతిక హక్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి, వైసీపీ కి చెందిన నేతలకు లేదు.2016లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ ఏమి మాట్లాడారు..?. గుంటూరు,విజయవాడల మధ్య రాజధాని అని ప్రకటించిన రోజు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శాసనసభలోనే ఉన్నారు.
ముప్పై వేల ఎకరాల భూమి రాజధానికి సరిపోదు. ఇంకా ఎక్కువ కావాలని మాట్లాడిన మాటలను జగన్ మరిచిపోయారా అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి ఆరోజు ఎందుకు మూడు రాజధానుల అంశం తీసుకురాలేదని.. కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ పాలన వికేంద్రీకరణ కాదు. రాష్ట్రానికి నమ్మక ద్రోహాం చేసిన జగన్ కు పాలించే హక్కు లేదు. రాజీనామా చేయండి. అసెంబ్లీను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా అని జగన్ కు బాబు సవాల్ విసిరారు.