తెలంగాణ రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఫిష్న్ కంపెనీ ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీ రామారావు తో కంపెనీ అధికారులు భేటీ అయ్యారు. ఫిషొన్ పెట్టుబడితో సుమారు 5వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఫిషన్ ఎగుమతి చేస్తోంది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెడికల్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు కనోయాంట్ పేర్కొంది. మెడికల్ డివైస్ తయారీలో కన్హయాంట్ ప్రఖ్యాతి గాంచింది.
