తన శరీర ఆకృతిపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని సినీనటి రాశీఖన్నా అన్నారు. ఓ బాలీవుడ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో మంచి పాత్రల్లో నటించే అవకాశం లభించిందని చెప్పారు. అయితే చూడటానికి తాను లావుగా ఉండటంతో సౌత్‌లో చాలా మంది గ్యాస్ ట్యాంకర్‌తో పోల్చేవారని తెలిపారు.
ఆ తర్వాత కొన్ని రోజులకి సన్నగా అవ్వాలని నిర్ణయించుకుని అలాగే ఫిట్‌గా అయ్యానని చెప్పుకొచ్చారు. ఎవరి నోళ్లో మూయించడానికి తాను స్లిమ్‌గా మారలేదని.. తాను ఉంటున్న ఫీల్డ్కి స్లిమ్‌గా ఉండటం అవసరం ఉందని అర్థమైందన్నారు. అందుకే సన్నబడ్డానని చెప్పారు. ఇలాంటి ఎన్నో విమర్శలు ఎదురైనా తానెప్పుడూ బాధపడలేదన్నారు రాశీఖన్నా.