ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెన్షన్ చేశారు. వీరిని రెండు రోజుల పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. జంగారెడ్డి గూడెంలో సారా మరణాలపై చర్చించాలని పట్టు బడుతూ ఈ రోజు బుధవారం అసెంబ్లీలో చిడతలు వాయిస్తూ నిరసన తెలుపడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభా ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారని, రోజురోజుకూ టీడీపీ సభ్యులు దిగజారుతున్నారని స్పీకర్ మండిపడ్డారు. మీరు శాసనసభ్యులే అని ప్రశ్నించారు.