హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోనే తనకు పంచాయితీ అని.. కాంగ్రెస్‌తో కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నిజాలను నిర్మోహమాటంగా నిజాలు మాట్లాడటం తన స్వభావమని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డితో ఉన్న విభేదాలపై చెప్పారు.
‘ఇది మా ఇద్దరి గుణగణాల పంచాయితీ. మెదక్ పర్యటనకు రేవంత్ వెళ్తే నాకు చెప్పలేదు. నాకు పిలవకపోవడంతో కోపం వచ్చింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అలాంటి వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా? నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలగించి రేవంత్ ఝలక్ ఇచ్చాడు.. నేను కూడా ఫ్యూచర్లో ఝలక్ ఇస్తా.. అవి ఎలా ఉంటాయో చూడు’’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్సిద్ధంగా ఉంటే ఆయనతో ఫేస్ టు ఫేస్‌కి తాను రెడీగా ఉన్నానని చెప్పారు.