హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు వితండ వైఖరి అవలంబిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసలు వీళ్ల వైఖరి చూస్తుంటే తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు.
ధాన్యం సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలంటూ రైతుల పక్షాన సీఎం కేసీఆర్ స్పష్టంగా డిమాండ్ చేశారని చెప్పారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాకు మరో నీతి ఉండకూడదని కవిత అన్నారు. పంజాబ్‌లో కేంద్ర ప్రభుత్వ వందశాతం వడ్లు కొనుగోలు చేసినట్లే తెలంగాణలోనూ కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.