అంతా ఊహించినట్టే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పంజాబ్ నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. భజ్జీతోపాటు ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, ఐఐటీ ప్రొఫెసర్ డా.సందీప్ పతాకన్ను కూడా రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల పంజాబ్లో ఐదు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వనుండగా.. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది.
