తెలంగాణలో,ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసన సభలో ప్రకటించిన నేపథ్యంలో పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పర్వతగిరి మండల ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి సీఎం కేసీఆర్ గారి చిత్ర పటానికి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పాలాభిషేకం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేష్ గారిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్లు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పరిపాలనదక్షుడు, దయామయుడు సీఎం కేసీఆర్ గారని ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అభివర్ణించారు.
ఈ బడ్జెట్ సమావేశాలు ఉద్యోగులు, నిరుద్యోగులు, రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల ప్రజల పట్ల సీఎం కేసీఆర్ గారి నిబద్దతకు నిదర్శనమని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే టీఆరెఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, మండల ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.