ప్రస్తుతం ప్రపంచాన్ని ఫోర్త్ వేవ్ గజగజ వణికిస్తోంది. అందులో భాగంగా ఇజ్రయేల్ ,సౌత్ కొరియో లాంటి దేశాల్లో రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్ పై కేంద్రం క్లారిటీచ్చింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ స్టెల్త్ బీఏ.2తో దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉంది.. అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ప్రజలందరూ మాస్కులు, శానిటైజర్ తప్పకుండా వాడాలని సూచించింది.
ఈనెల 27 నుంచి అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రాలు టెస్టులు పెంచాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. కాగా దేశంలో ప్రస్తుతం నిత్యం 3-4 వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి.