తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అర్హులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. నిన్న గురువారం సిద్దిపేటలో పర్యటించిన మంత్రి హారీష్ రావు పలు అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ క్రమంలో జిల్లాలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ వచ్చేనెలలో అభయహస్తం లబ్ధిదారులు డబ్బులను ప్రభుత్వం వడ్డీతో సహా చెల్లిస్తుందన్నారు. అలాగే సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణం చేసుకునే లబ్ధిదారులకు మూడు దఫాల్లో రూ.3లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు.