టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు. మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అందరూ బాగుంటే సంతోషంగా ఉంటుంది.
ఆదర్శంగా గర్వంగా ఉంటుంది. బాగుండకపోతే కోపం వస్తుంది. ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ పాలన చూస్తుంటే సిగ్గేస్తుంది. నా అనుభవంలో ఎందరో సీఎంలను చూశాను.
మంచి, చెడ్డ సీఎంలను సైతం చూశమ్ను. ఇంత దుర్మార్గమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ ను చూడటం ఇదే తొలిసారి.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ ఖర్మ కాలి వైసీపీ గెలుపొందితే జగన్ మళ్లీ సీఎం అయితే పక్క రాష్ట్రాలకు వెళ్లాలని సగం ప్రజలు అనుకుంటున్నారు’ అని ఆయన ఫైరయ్యారు.