బుల్లితెరపై తన టాలెంట్ తో స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది సుమ. తనది మాములుగా మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. తన కెరీర్ బిగినింగ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. సక్సెస్ కాకపోవడంతో తన కృషితో ఇప్పడు స్టార్ యాంకర్ గా స్థిరపడిపోయింది. ప్రస్తుతం ఒకో ఈవెంట్ కు 3 నుంచి 5 లక్షల వరకూ పారితోషికం అందుకుంటోంది సుమ.
అడపాదడపా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసినప్పటికీ.. పూర్తి స్థాయిలో ఆమె ఇంతవరకూ ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయితీ’ అనే చిత్రం లో నటిస్తోంది. కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొలివరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల విడుదలై.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ సినిమా కోసం సుమ భారీ పారితోషికం అందుకున్నట్టు వార్త లొస్తున్నాయి.
ఈ సినిమా కోసం ఆమె దాదాపు రూ. 50 లక్షల వరకూ ఛార్జ్ చేసిందట. ఆమెకున్న క్రేజ్ కారణంగా నిర్మాతలు ఆమె అడిగినంతా ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా థియేటర్స్ లో వర్కవుట్ కాకపోయినా కనీసం ఓటీటీలో, టీవీలో అయినా బాగా పోతుందని నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.