తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది.
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏకగ్రీంగా ఆమోదించింది.