అరికాళ్ల పగుళ్లకు ఇలా చెక్ పెట్టండి
రాత్రి నిద్రపోయే ముందు కాలి పగుళ్లకు కొబ్బరినూనె పూయాలి.
పగుళ్లు ఉన్నచోట మర్దన చేయాలి.
అలోవెరా జెల్‌తో పాదాల పగుళ్లకు రుద్దాలి. దీనివల్ల
పగుళ్లు మాయమవుతాయి.
గోరువెచ్చని నీటిలో కాళ్లను పెట్టడం వల్ల చక్కని ఫలితం కలుగుతుంది.
ఒక టబ్‌లో నీళ్లు పోసి అందులో నిమ్మరసం పిండాలి.
రెండు కాళ్లను ఆ నీళ్లలో 20 నిమిషాల పాటు ముంచి బయటకు తీయాలి. దీంతో మృత కణాలు తొలగిపోతాయి.