ఆకస్మికంగా మృతి చెందిన ఆసీస్ లెజండ్రీ ఆటగాడు స్పిన్నర్ షేన్ వార్న్ కు ఇండియాతో మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్ తొలి సీజన్-2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ వార్న్ వ్యవహరించాడు.
ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన జట్టును ఫైనల్ కు చేర్చాడు. తుది పోరులో మంచి లైనప్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్న చిత్తు చేసి రాజస్థాన్ జట్టును విజేతగా నిలిపి ఐపీఎల్ తొలి ట్రోఫీని అందుకున్నాడు.