శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరోసారి సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టులో 96 పరుగుల వద్ద ఔటయ్యాడు.
దీనిపై మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘పిల్లలు పరీక్షల్లో 90కి పైగా మార్కులు సాధిస్తే తల్లిదండ్రులు గర్వపడతారు. లెజెండ్స్ 90+ స్కోర్ చేస్తే దేశం మొత్తం గర్వంగా ఫీలవుతుంది. సెంచరీ చేజారిందని బాధపడకు పంత్’ అని చెప్పాడు. పంత్ టెస్టుల్లో 90ల్లో ఔటవడం ఇది ఐదోసారి.