కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ముక్తి మార్గం, యాదాద్రి పునర్నిర్మాణంతో భక్తిమార్గాన్ని భావితరాలకు గుర్తిండిపోయేలా సీఎం కేసీఆర్ రెండు గొప్ప పనులు చేశారని సీనియర్ జర్నలిస్ట్ కే రామచంద్రమూర్తి కొనియాడారు.ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొన్నారు. అనంతరం నూతన ఆలయాన్ని పరిశీలించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సైతం యాదాద్రీశుడిని దర్శించుకొన్నారు. సీఎం కేసీఆర్.. అత్యంత పురాతనమైన యాదాద్రిని పునర్నిర్మించి గొప్ప గౌరవాన్ని సంపాదించుకొన్నారని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.