టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు (3,307) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ ఈ ఘనతను అందుకున్న రోహిత్.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(3,299) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్లో రోహిత్ 32 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 44 పరుగులు చేశాడు.
