ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటి వాచ్మెన్ కీలక విషయాలు వెల్లడించాడు. ఉదయం 7 గంటల సమయంలో జిమ్‌కు వెళ్లేందుకు మంత్రి సిద్ధమయ్యాడు. అంతలోనే గుండెలో నొప్పి వస్తోందంటూ సోఫాలోనే కూర్చున్నారు. వెంటనే కుటుంబ సభ్యులను, గన్మెన్లను అప్రమత్తం చేశాం.
వారు ఛాతీపై బలంగా ఒత్తినప్పటికీ ఆయనలో చలనం లేదు. దీంతో హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించినట్లు వాచ్మెన్ చెప్పాడు.గౌతమ్ రెడ్డిని ఉదయం 7:45 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
అప్పటికే ఆయన స్పందించలేని స్థితిలో ఉన్నారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సయమానికి గౌతమ్ రెడ్డి శ్వాస కూడా తీసుకోవడం లేదు. కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ డాక్టర్లు కలిసి మంత్రికి 90 నిమిషాలకు పైగా సీపీఆర్ చేశారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం ఉదయం 9:16 గంటలకు కన్నుమూసినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు.