ఐపీఎల్ -2022 సీజన్ ఆరంభానికి ముందు SRHకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్.. సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు.. ది ఆస్ట్రేలియన్ పత్రిక కథనం ప్రచురించింది. గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన SRH.. కేవలం మూడింటిలో గెలిచింది. ఈ క్రమంలో కటిచ్ రాజీనామా చర్చనీయాంశమైంది.
