కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని సూరారం కట్ట మైసమ్మ జాతర సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అమ్మవారి జాతర సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కట్ట మైసమ్మ అమ్మవారి దీవెనలు ప్రజలపై తప్పక ఉంటాయని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు వారాల వినోద్, మన్నెరాజు, మన్నె బాలేశ్, యాదిరెడ్డి, రాఘవ రెడ్డి, సోమేష్ యాదవ్, వేణు యాదవ్, సురేష్, మహేష్, మైపాల్, గోపాల్, రమేష్ గౌడ్, యూసుఫ్, ప్రభాకర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.