దళితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు దళిత బంధు పధకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ పధకం పక్కాగా అమలు జరిగేలా అధికారులు ఏర్పాట్లు జరపాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్ సీ కార్పోరేషన్ ఎగ్జి కుటివ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ నేతృత్వంలో అధికారులు శనివారం సీతాఫలమండీ కార్యాలయంలో ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తొలి దశలో వంద మందికి ఈ పధకంలో అవకాశం కల్పిస్తున్నప్పటికీ, దశల వారీగా ఎక్కువ సంఖలో దళితులకు అవకాశం లభిస్తునందని తెలిపారు. ఈ పధకం పట్ల అవగాహన కు త్వరలో ఓ సదస్సును ఏర్పాటు చేయాలని శ్రీ పద్మారావు గౌడ్ సూచించారు. డాక్టర్ రమేష్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో పకడ్బందీగా దళిత బంధు పధకం అమలు చేసేలా ఏర్పాట్లు జరుపుతున్నామని తెలిపారు