టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మకి బోణి అదిరిపోయింది. గత ఏడాది డిసెంబరులో వన్డే జట్టు పగ్గాలు అందుకున్న హిట్‌మ్యాన్.. కెరీర్లో ఫస్ట్ టైమ్ భారత జట్టుని రెగ్యులర్ కెప్టెన్‌గా నడిపిస్తున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో.. రోహిత్ శర్మ తన వ్యూహ చతురతతో జట్టుకి తిరుగులేని విజయాల్ని అందిస్తున్నాడు.
మ్యాచ్ గమనానికి అనుగుణంగా జట్టులో బౌలర్లని మారుస్తూ.. వారి అభిప్రాయాల్ని గౌరవిస్తూ ఫీల్డింగ్‌ని సెట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని హిట్‌మ్యాన్ అందుకోగా.. మూడు వన్డేల సిరీస్‌ని కూడా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో భారత్ కైవసం చేసుకుంది. ఈ రెండు వన్డేల్లోనూ ఇషాన్ కిషన్, రిషబ్ పంత్‌ని ఓపెనర్లుగా ఆడించి రోహిత్ శర్మ సరికొత్త ప్రయోగాలకి తెరదీశాడు.
వెస్టిండీస్‌తో నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన రెండు వన్డేల్లో.. నాలుగు సార్లు డీఆర్ఎస్ కోరిన రోహిత్ శర్మ అన్నింటిలోనూ సక్సెస్ అయ్యాడు. భారత క్రికెట్ చరిత్రలో ఈ తరహాలో ఫస్ట్‌లోనే నాలుగు రివ్యూలు సక్సెస్ అయిన కెప్టెన్ లేడంటే అతిశయోక్తి కాదేమో! మొత్తంగా జట్టులో తన కెప్టెన్సీ మార్క్‌ని చూపిస్తున్న రోహిత్ శర్మ.. 2023 వన్డే వరల్డ్‌కప్ కోసం ఇప్పటి నుంచే జట్టుని రెడీ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.