నిన్న పార్లమెంటులో అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజ్యసభ ముగిసిన అనంతరం షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సహచర ఎంపీలు రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
