తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో తాజాగా మరో 746 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 181,299 కరోనా కేసులు నమోదయ్యాయి.
15-18 సంవత్సరాల వయసు గల వారు కొవిడ్ వ్యాక్సిన్, మొదటి డోస్ తీసుకున్నవారు రెండో డోస్, 60 ఏళ్ల వయసు పైబడిన వారు, ఫ్రెంట్ లైన్ వర్కర్స్ బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు.