ఏపీ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే మహిళలపై మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ పీఏ లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇప్పటికీ ఆ పార్టీ సమాధానం చెప్పలేదని హోంమంత్రి సుచరిత అన్నారు.
విజయవాడలో 14 ఏళ్ల బాలికను బలితీసుకున్న తెలుగు దేశం పార్టీకి చెందిన నేత వినోద్ బాను కఠినంగా శిక్షిస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. వనజాక్షిపై దాడి, కాల్మనీ రాకెట్, రిషితేశ్వరి ఆత్మహత్యపై ఇప్పటికీ ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారన్నారు.