యూపీలోని అన్ని నియోజకవర్గాల్లో (403) దాదాపు 30 ఏళ్ల తర్వాత పోటీ చేస్తున్నామని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వాద్రా తెలిపారు. ఇది తమకు అతిపెద్ద ఘనతగా పేర్కొన్నారు. ప్రభుత్వంపై పోరాటంలో తనపై ఎన్నికేసులు పెట్టినా ఎదుర్కొంటాను.
జైలు శిక్ష అనుభవించడానికైనా సిద్ధమేనన్నారు. గత ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీచేసి 60 సీట్లు కూడా సాధించలేకపోయాయి. ఈ సారి కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగుతోంది.