ఖానాపూర్ పట్టణం లోని పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరే సమయం ఆసన్నమైంది ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ గారు అన్నారు. నేడు ఖానాపూర్ పట్టణం లోని 11 వ వార్డులో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్ రూం అర్జీదరుల నుండి అర్జిల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ గారు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫరూఖి అలి గారితో కలిసి ప్రారంబించారు.
తెలంగాణ ప్రభుత్వం లో గౌరవ ముఖ్య మంత్రి కెసిఆర్ గారు ప్రతి పేదవాడి కల సొంత ఇల్లు అని అన్నారు. అలాగే గతం లో ఇంద్రమ్మ ఇల్లు పేరుతో నాయకులే బాగు పడ్డారు తప్ప ప్రజలకు న్యాయం జగలేదు అని అన్నారు. ఖానాపూర్ పట్టణంలో మొదటగా 400 డబుల్ బెడ్ రూం పూర్తి అయ్యింది అన్నారు. అలాగే ప్రతి ఒక్కరి నిజమైన అర్హత కలిగిన వారిని ఎంపిక చెయ్యడం జరుగుతుంది అని అన్నారు. ప్రతి వార్డుల వారీగా అధికారులు వెళ్లి లబ్ధిదారులను నుండి అర్జీలను తీసుకుంటారని తెలియజేశారు. ఎవరైనా సరే డబుల్ బెడ్ రూం ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే పిడి యాక్ట్ ద్వరా జైలుకు పంపడం జరుగుతుంది అని తెలిపారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం లో కరోనా కాలంలో కూడా ఏ సంక్షేమ పథకాలు అగలెందని ఎమ్మెల్యే గారు అన్నారు.ఇప్పటికే ఖానాపూర్ పట్టణాన్ని మున్సిపాలిటీగా చేసి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది అని అన్నారు.ఎల్లవేళల ఎటువంటి సమస్యలు ఉన్న నేరుగా తన వద్దకు రావాలని కానీ మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు.డబుల్ బెడ్ రూం ల విషయం లో ఎవరికి రూపాయి కూడా ఎవ్వలిసిన అవసరం లేదు అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారితో కలిసి ఉద్యనవవనం పార్కు మరియు డబుల్ బెడ్ రూంలను పరిశీలించారు.