ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కరోనా బారినపడ్డారు.
ఆయన కోవిడ్ కు సంబంధించిన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన తన వ్యక్తిగత సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానన్నారు.
గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఇప్పటికే టీడీపీ నేత నారా లోకేశ్,ఆ పార్టీ అధ్యక్షుడు,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే.