పండుగలు భారతదేశ శక్తిమంతమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని సూచిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు.
పలు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి, మాగ్ బిహు, ఉత్తరాయన్, పొంగల్, భోగీని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ పలు భాషల్లో ట్వీట్లు చేశారు.
ఈ పండుగలు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఆనందాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.