ఏపీలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రకరకాల పార్టీలు మనతో పొత్తు కోరుకోవచ్చు.
అయితే, జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. పొత్తుల కంటే ముందు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాం. ఇతర పార్టీలతో పొత్తుపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని పవన్ అన్నారు.
‘వన్ సైడ్ లవ్’ అని జనసేనతో పొత్తును ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.