అమెరికాలో జనవరి, 2020 నుంచి ఇప్పటివరకు 60 మిలియన్ల (6కోట్లు) మందికి పైగా కరోనా బారిన పడ్డారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇందులో 8,37,594 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ప్రపంచంలో నమోదైన కరోనా కేసుల్లో 20 శాతం, మరణాల్లో 15 శాతం ఒక్క అమెరికాలోనే ఉన్నాయని పేర్కొంది. నవంబర్ 9, 2020 నాటికి అమెరికాలో కోటి కేసులు రాగా జనవరి 1, 2021కి అవి 2 కోట్లకు పెరిగాయి.
