తెలంగాణకు బీజేపీ ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ సీఎం రాగా.. ఆదివారం అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ వస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు స్వాగతం పలకనున్నారు.
అస్సాం సీఎం బండి సంజయ్‌తో కలసి రోడ్డు మార్గంలో వరంగల్‌కు బయలుదేరతారు. మధ్యహాన్నం 12గంలకు ఉపాధ్యాయ, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై బండి సంజయ్‌తో కలసి హిమాంత బిస్వా శర్మ బీజేపీ దర్నాలో పాల్గొననున్నారు.