కొవిడ్ శరవేగంగా నగరాన్ని చుట్టేస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత నెలలో వచ్చిన మొత్తం కేసుల కంటే ఇప్పుడు కేవలం వారం రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి.
రెండు రోజుల క్రితం రోజుకు సగటున 576 వరకు కేసులు నమోదయితే, శనివారం ఒక్కరోజే 1,583 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన ఎనిమిది రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 6,610 మందికి వైరస్ సోకింది. ఈనెల 3వ తేదీ నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
గతంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇబ్బందులు ఉంటే కొవిడ్‌గా అనుమానించే వారు. కానీ, ఇప్పుడు అలాంటి లక్షణాలు ఉంటే పారాసిటమాల్ వేసుకొని ఇంటి వద్దనే ఉంటున్నారు. డాక్టర్లు సూచిస్తే కానీ కొందరు పరీక్షలు చేయించుకోవడం లేదు. మరికొందరు తెలిసిన డాక్టర్‌ను సంప్రందించి మందులు వాడుతున్నారు.