స్టార్ హీరోయిన్ త్రిష కరోనా బారిన పడింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తనకు కోవిడ్ సోకిందని ట్వీట్ చేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే తనకు వచ్చిందని పేర్కొంది. వైరస్ నుంచి వేగంగా కోలుకుంటున్నానని తెలిపింది. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నానని, దాని వల్ల మేలు జరిగిందని చెప్పింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరింది.
