తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే ఇంట్లో అగ్ని ప్రమాద సంఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలోని కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది.ఈ రోజు శనివారం తెల్లవారుజామున ఇంట్లో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే భార్య సరోజకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఎమ్మెల్యే భార్య సరోజకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.