దేశ రాజధానిలో ఈ రోజు దాదాపు 10వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం 8.3గా ఉన్న పాజిటివిటీ రేటు 10 శాతానికి చేరనుందని అంచనా వేశారు.
దేశం మూడో వేవ్లోకి ప్రవేశించిందన్న ఆయన.. ఢిల్లీకి మాత్రం అది ఐదో వేవ్ అని వెల్లడించారు. ఇక ప్రైవేటు 40 శాతం పడకలు కొవిడ్ బాధితుల కోసం రిజర్వ్ చేసినట్లు చెప్పారు.