సినిమా ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. రూ.22.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఆ లక్ష్యాన్ని బ్రేక్ చేసి రూ. 2.07 కోట్ల లాభంతో ముందుకెళ్తుంది.
గత 10 రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 24.57 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.18.29కోట్లు, ROIలో రూ.2.80కోట్లు, ఓవర్సీస్లో రూ. 3.48కోట్లు వసూలు చేసింది.