పర్వతగిరి మండల కేంద్ర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్వతగిరి గ్రామ శివారులో కారు, బైక్ ఢీకొని ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
అదే మార్గంలో వెళ్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు వెంటనే క్షతగాత్రుల వద్దకు వెళ్లి అంబులెన్సు ఫోన్ చేసి బాధితులను పరామర్శించారు. అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉండి, ఎంజీఎం సూపరేంటెండ్ గారికి ఫోన్ చేసి రోడ్డు ప్రమాద బాధితులకి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
ప్రమాదానికి గల కారణాలను, ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ అధికారులను ఆదేశించారు.