తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది.ఎస్ఆర్డీపీ లో భాగంగా ఒవైసీ-మిథాని జంక్షన్లో రూ.80కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ఉ.10.30లకు ప్రారంభించనున్నారు.
ఈ ఫ్లైఓవర్ కంచన్ బాగ్ ని పిసల్బండ్ డీఆర్డీఎల్ వైపు నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ మీదగా ఎల్బీ నగర్ వరకు వెళుతుంది. దీంతో ఎస్ఆర్డీపీలో ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వంతెనల సంఖ్య 13, అండర్పస్ సంఖ్య 4కి చేరనుంది.