దేశంలోనే తొలి ఐఏఎంసీ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. నానక్‌రామ్‌గూడలోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కలిసి ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐఏఎంసీ వెబ్సైట్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఐఏఎంసీ కేంద్రాన్నిసీజేఐకు అప్పగించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఐఏఎంసీ ఏర్పాటు అవుతోంది. ఐఏఎంసీ శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు పూర్తయ్యాయి.
ఈ కార్యక్రమంలో ట్రస్టీలు – సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమాకోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహముద్ అలీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.