తెలంగాణలో ఇటీవల జరిగిన ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధుసూధన్ రావు విజయం సాధించిన నేపథ్యంలో.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన ఎమ్మెల్సీ తాత మధుకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ అభ్యర్థి గెలుపునకు ఉమ్మడిగా కృషి చేసిన ప్రజా ప్రతినిధులందరినీ ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రావతి, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.