తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి నిర్మాత సీ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలపై మాట్లాడిన ఆయన.. ఇదే సమయంలో ఇండస్ట్రీలో ఇన్‌ఫ్లూయెన్స్ చేసే వ్యక్తులు కరవయ్యారని చెప్పారు. దాసరి నారాయణరావు చనిపోవడంతో ఆ లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలపై పెంపుదలపై ఏపీ ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలని సీ కళ్యాణ్ కోరారు. ఇద్దరు తెలురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టాలీవుడ్‌కు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని చెప్పిన కళ్యాణ్.. ఇటీవలి కాలంలో జగన్‌తో కొంత గ్యాప్ వచ్చిందని అంగీకరించారు.
ఆన్‌లైన్ టిక్కెటింగ్ విధానం తమకు సాయం చేస్తుందని ఆయన తెలిపారు. అయితే, పెరిగిన టిక్కెట్ల ధరలు చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. దాసరి నారాయణరావు వంటి ఇన్‌ఫ్యూయెన్స్ చేసే వ్యక్తి ప్రస్తుతం ఇండ్రస్టీలో లేరని చెప్పారు. ఆయన ఉండిఉంటే మాత్రం సమస్యలను ఈజీగా పరిష్కరించేలా మధ్యవర్తిత్వం నెరిపేవారన్నారు.